పెళ్లికి ముందే మీ భాగస్వామితో.. ఈ విషయాలు తెలుసుకుంటే అంతా హ్యాపీ..
relationship Jun 03 2025
Author: Rajesh K Image Credits:gemini
Telugu
ఒకరి ఆలోచనలు ఒకరు తెలుసుకోవాలి
పెళ్లికి ముందే మీ జీవిత భాగస్వామికి మీ ఆలోచనలు, అభిప్రాయాలు, కుటుంబంలో మీ పాత్ర ముందుగానే తెలియజేయడం చాలా ముఖ్యం. వైవాహిక జీవితం సవ్యంగా సాగాలంటే ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండాలి.
Image credits: gemini
Telugu
కుటుంబాల గురించి
ఒకరి కుటుంబం గురించి మరొకరు తెలుసుకోవాలి. ఇరు కుటుంబాల సంప్రదాయాలు, ఆర్థిక స్థితి గతులు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
Image credits: gemini
Telugu
ఆరోగ్య పరిస్థితి
పెళ్లికి ముందు ఇద్దరూ వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ముందే చెప్పడం వల్ల ఇద్దరూ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
Image credits: gemini
Telugu
ఆర్థిక స్థితి
సంపాదన, ఖర్చులు, అప్పులు, దాచుకున్న డబ్బు గురించి ఇద్దరూ మాట్లాడుకోవాలి. డబ్బు విషయాల్లో గొడవలు వస్తే సంసారం సాఫీగా సాగదు.
Image credits: gemini
Telugu
పిల్లల గురించి
పెళ్లికి ముందు పిల్లల గురించి స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఈ విషయంపై ఏకాభిప్రాయం లేకపోతే భవిష్యత్తులో సమస్యలు తలెత్తవచ్చు. పిల్లలు కావాలా? వద్దా? ఎంతమంది కావాలి? అనేవి చర్చించాలి.
Image credits: gemini
Telugu
నమ్మకాలు, ఆచారాలు
ఒకరి నమ్మకాలు, ఆచారాలు ఇంకొకరు గౌరవించుకోవాలి. పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు విభిన్న సంస్కృతులు గల కుటుంబాల కలయిక కూడా.