నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్, బాలయ్య బాబు సినిమా నుంచి భారీ అప్ డేట్ రాబోతోంది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ2 నుంచి అదిరిపోయే అనౌన్స్ మెంట్ ను ఇవ్వబోతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే?
నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుంది.
బాలయ్య హ్యాట్రిక్ విజయాలు
2021లో విడుదలైన అఖండ సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న అఖండ 2 పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు, ఇది బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. అంతే కాదు ఇప్పటి వరకూ బాలయ్య వరుసగా నాలుగు హిట్ సినిమాలు చేశారు. హాట్రిక్ హిట్ దాటుకుని మరో సక్సెస్ సాధించిన బాలకృష్ణ అఖండ2 తో పాటు మరో హిట్ కొడితే డబుల్ హ్యాట్రిక్ రికార్డ్ సొంతం అవుతుంది. అటు రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ చూపించారు బాలయ్య. హిందూపురం ఎమ్మెల్యేగా కూడా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ విన్నర్ గా నిలిచారు.
అఖండ 2 టీజర్ రిలీజ్ డేట్ ?
ఈ నేపథ్యంలో జూన్ 8న మూవీ యూనిట్ టీజర్ డేట్ అనౌన్స్ చేసింది. బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2 టీజర్‌ను జూన్ 9 సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా త్రిశూలం పట్టుకున్న బాలకృష్ణ పోస్టర్‌ను విడుదల చేస్తూ “టీజర్ తాండవం చేయబోతుంది” అని ప్రకటించారు.
ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంటలు నిర్మిస్తున్నారు. బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని సమర్పణలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో ప్రగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అఖండ 2 రిలీజ్ ఎప్పుడంటే?
సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే బిజీ షెడ్యూల్‌లో ఉన్న సినిమా షూటింగ్ జార్జియాలో శరవేగంగా జరుగుతుంది.
ఇక రేపు టీజర్ విడుదలతో అఖండ 2పై మరింత హైప్ పెరగడం ఖాయం. బోయపాటి శైలిలో మాస్, యాక్షన్ సన్నివేశాలు, బాలయ్య పవర్‌ఫుల్ డైలాగులు ఈసారి ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.