Weight Loss: వీటిని రెగ్యులర్ గా తింటే పొట్ట చుట్టున్న కొవ్వు ఈజీగా తగ్గిపోతుంది!
బెల్లీ ఫ్యాట్.. ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది పెడుతున్నసమస్య. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకోవడానికి వారు చేయని ప్రయత్నాలు ఉండవు. అయితే కొన్నికూరగాయలను రెగ్యులర్ గా తీసుకుంటూ ఈజీగా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
బెల్లీ ఫ్యాట్ తగ్గించే కూరగాయలు
గజిబిజీ లైఫ్ స్టైల్, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుతం చాలామంది బెల్లీప్యాట్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మనం రెగ్యులర్ గా తినే కొన్ని కూరగాయల్లో ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. మరి ఆ కూరగాయలేంటో చూసేయండి.
ఆకుకూరలు
పాలకూర, మెంతికూర, బచ్చలికూర వంటి వివిధ రకాల ఆకుకూరలు తినడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఎ, సి, కె కూడా ఉంటాయి. ఇవి మెరుగైన జీర్ణక్రియకు సహాయపడతాయి.
బ్రోకలి
బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, మొలకెత్తిన గింజలు తినడం ఆరోగ్యానికి మంచిది. వీటిలో నీటి శాతం, ఫైబర్ ఎక్కువ. వీటిని తింటే జీవక్రియ మెరుగుపడుతుంది. కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
దోసకాయ
దోసకాయలో నీటి శాతం ఎక్కువ. క్యాలరీలు తక్కువ. దీన్ని తింటే శరీరానికి నీరు అందుతుంది. కడుపు నిండుగా ఉంటుంది. ఎక్కువ తినడాన్ని నిరోధిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
రెడ్ క్యాప్సికమ్
క్యాప్సికమ్ లో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు త్వరగా తగ్గాలంటే క్యాప్సికమ్ ని తీసుకోవచ్చు.
పుట్ట గొడుగులు
సహజంగా బరువు తగ్గడానికి పుట్ట గొడుగులు సహాయపడతాయి. వీటిలో క్యాలరీలు తక్కువ. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే కడుపు నిండుగా అనిపిస్తుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది.