Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Relationship
  • Father's Day Wishes & Quotes: నాన్నపై మీకున్న ప్రేమను ఇలా చెప్తే.. ఆయన సంతోషానికి హద్దులుండవు!

Father's Day Wishes & Quotes: నాన్నపై మీకున్న ప్రేమను ఇలా చెప్తే.. ఆయన సంతోషానికి హద్దులుండవు!

ప్రతి తండ్రి తన పిల్లలను అపురూపంగా చూసుకుంటాడు. కష్టాలన్నీ తాను పడి.. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలనుకుంటాడు. అలాంటి తండ్రుల త్యాగాలకు గుర్తుగానే మనం ప్రతి సంవత్సరం ఫాదర్స్ డే జరుపుకుంటాము. మరి ఈ ఫాదర్స్ డే నాడు నాన్నపై మీకున్న లవ్ ని ఇలా చెప్పండి. 

Kavitha G | Published : Jun 14 2025, 02:18 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
నాన్న త్యాగాలు మరువలేనివి
Image Credit : freepik@starline

నాన్న త్యాగాలు మరువలేనివి

Father's Day Wishes & Quotes: మనందరికీ మొదటి హీరో నాన్నే. నాన్న ఎప్పుడూ మనపై కోపం చూపించినా, మనతో కఠినంగా ప్రవర్తించినా అది మన మంచి కోసమే. మనకు మంచి జీవితం ఇవ్వాలనే. పిల్లల కోసం నిత్యం కష్టపడే వ్యక్తి నాన్న. కష్టాలన్నీ తాను అనుభవించి.. సుఖాలను మాత్రమే పిల్లలకు ఇవ్వాలి అనుకుంటాడు నాన్న. అలాంటి నాన్నల త్యాగాలను గుర్తుంచుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏటా నాన్నల దినోత్సవం జరుపుకుంటారు.

27
జూన్ 3వ ఆదివారం
Image Credit : Pixabay

జూన్ 3వ ఆదివారం

ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా నాన్నల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సంవత్సరం నాన్నల దినోత్సవం రేపు(జూన్ 15 ఆదివారం) వస్తుంది. మన జీవితానికి మార్గదర్శకుడైన నాన్నను ఆనందపరిచే కొన్ని కొటేషన్స్ ఇక్కడ ఉన్నాయి. వాటితో నాన్నలను విష్ చేయండి. వారు చాలా సంతోషిస్తారు. 

Related Articles

Father's Day:  తండ్రి త్యాగం, కూతురి ప్రేమకు నిదర్శనం..!
Father's Day: తండ్రి త్యాగం, కూతురి ప్రేమకు నిదర్శనం..!
Father's Day: నాన్నకోసం స్పెషల్ ట్రీట్, ఈ వంటలు చేసి పెట్టండి..!
Father's Day: నాన్నకోసం స్పెషల్ ట్రీట్, ఈ వంటలు చేసి పెట్టండి..!
37
నాన్నకు ప్రేమతో..
Image Credit : freepik@sketchepedia

నాన్నకు ప్రేమతో..

1. నాన్న.. నా జీవితానికి మీరే మార్గదర్శి. మీరే నా సూపర్ హీరో.. నాన్నల దినోత్సవ శుభాకాంక్షలు నాన్న.

2. నాన్న… నాన్నల దినోత్సవ శుభాకాంక్షలు! మీ ప్రేమకు, మార్గదర్శకత్వానికి నా ధన్యవాదాలు.

47
నాన్నే మొదటి హీరో
Image Credit : freepik@freepic-diller

నాన్నే మొదటి హీరో

3. నాన్న.. నువ్వే నా మొదటి హీరో. నా మార్గదర్శి. నాకు అండగా నిలిచేవాడివి. నీకు నా హృదయపూర్వక నాన్నల దినోత్సవ శుభాకాంక్షలు!"

4. నాన్న.. నువ్వు నాకు చాలా నేర్పావు. నేను ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటాను. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.

57
గొప్ప బహుమతి
Image Credit : Social Media X

గొప్ప బహుమతి

5. నాన్న.. మీ ప్రేమే ఈ ప్రపంచంలో నాకు దక్కిన గొప్ప బహుమతి. నాన్నల దినోత్సవ శుభాకాంక్షలు నాన్న.

6. మీ జ్ఞానం, ప్రేమ నన్ను ప్రతిరోజూ నడిపిస్తున్నాయి. నాన్నల దినోత్సవ శుభాకాంక్షలు నాన్న.

67
హ్యపీ ఫాదర్స్ డే
Image Credit : our own

హ్యపీ ఫాదర్స్ డే

7. నాన్న.. నువ్వే నాకు ఆదర్శం. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.

8. నాన్న.. మీ ప్రేమే నాకు దక్కిన గొప్ప ఆశీర్వాదం. నాన్నల దినోత్సవ శుభాకాంక్షలు నాన్న.

77
నాన్న ప్రేమ వెలకట్టలేనిది
Image Credit : our own

నాన్న ప్రేమ వెలకట్టలేనిది

9. నాకు దక్కిన గొప్ప బహుమతి మీరు. దేవుడి రూపంలో వచ్చిన తండ్రి మీరు. నాన్నల దినోత్సవ శుభాకాంక్షలు నాన్న.

10. నాన్న.. మీ ప్లేస్ ని ఎవరూ భర్తీ చేయలేరు. మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.

Kavitha G
About the Author
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. Read More...
బంధుత్వం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
చిన్నారుల సంరక్షణ
 
Recommended Stories
Top Stories